
ఇంటర్ పరీక్షలకు .....
ఇంటర్ పరీక్షల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది.
ఇంటర్ పరీక్షల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు 175 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వర్‌రావు తెలిపారు.
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. రెగ్యులర్ బస్సులకు ఇవి అదనం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీ క్షలు జరగనున్న దృష్ట్యా.. అరగంట ముందుగానే అంటే ఉదయం 8.30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 12 నుంచి కూడా ఈ బస్సులు తిరుగుతాయి.
నడిచే రూట్లు: సికింద్రాబాద్ నుంచి కోఠి, అఫ్జల్‌గంజ్, దిల్ సుఖ్‌నగర్, రిసాల బజార్, వెంకటాపురం, శిల్పారామం, కొండాపూర్, నాంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాలకు, ఈసీఐఎల్ నుంచి అఫ్జల్‌గంజ్‌కు, మెహిదీపట్నం నుంచి అఫ్జల్‌గంజ్, జీడిమెట్ల ప్రాంతాలకు, బోరబండ నుంచి కోఠి, చార్మినార్‌లకు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ఈఎస్‌ఐ, బోరబండ, గోల్కొం డలకు, మెహిదీపట్నం నుంచి చార్మినార్, సికింద్రాబాద్ నుంచి రాంనగర్, బాగ్‌లింగంపల్లి, అఫ్జల్‌గంజ్‌లకు, ఎల్‌బీనగర్ నుంచి నాగోల్, ఉప్పల్, సికింద్రాబాద్‌లకు, హిమాయత్‌సాగర్-బహదూర్‌పురా, మధుబన్‌కాలనీ-కోఠీ, ఉప్పల్-మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్-సనత్‌నగర్, సికింద్రాబాద్-పటాన్‌చెరు తదితర మార్గాల్లో..