ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్‌ చుక్కలు | hyderabad and visakhapatnam private travel stops for technical issue | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్‌ చుక్కలు

May 19 2017 10:18 AM | Updated on Sep 5 2017 11:31 AM

ప్రయాణికుల నుంచి టికెట్ల డబ్బులు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం వారి కష్టాలను మాత్రం గాలికొదిలేసింది.

కీసర: ప్రయాణికుల నుంచి టికెట్ల డబ్బులు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం వారి కష్టాలను మాత్రం గాలికొదిలేసింది. రంగారెడ్డి జిల్లా కీసర వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎస్‌వీకేడీటీ ట్రావెల్స్‌ బస్సు సాంకేతిక లోపంతో కీసర వద్ద జాతీయ రహదారిపై నిలిచిపోయింది.

అయితే కొన్ని గంటల వరకూ తమను ట్రావెల్స్‌ యాజమాన్యం పట్టించుకోలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తిరుగు ప్రయాణాలకు కూడా టిక్కెట్లు తీసుకున్నామని కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. దీనిపై కీసర పోలీస్ స్టేషన్‌లో ట్రావెల్స్‌ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement