
బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
నగరంలోని బోయిన్పల్లిలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ప్లాస్టిక్ పైపుల గోడౌన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లోని సామాన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. పొగలు తీవ్రంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తున్నారు.