డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఫిర్యాదుల వెల్లువ | Huge complaints on the Degree on online entrances | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఫిర్యాదుల వెల్లువ

Aug 23 2017 1:09 AM | Updated on Oct 30 2018 7:30 PM

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఫిర్యాదుల వెల్లువ - Sakshi

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఫిర్యాదుల వెల్లువ

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల మూడో దశ సీట్ల కేటా యింపులో నెలకొన్న గందరగోళంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి.

విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు: కడియం 
 
సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల మూడో దశ సీట్ల కేటా యింపులో నెలకొన్న గందరగోళంపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హెల్ప్‌డెస్క్‌ను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. సోమవారం వరకు వచ్చిన ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్షించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మూడో దశ కౌన్సెలింగ్‌లో ఈ నెల 17న రివైజ్డ్‌ సీట్ల కేటాయింపులో సీట్లు పొందిన వారు ఈనెల 23లోగా కాలేజీల్లో చేరే అవకాశముంది. 
 
రేపు తుది నిర్ణయం..: సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరిన వారు పోగా, మిగతా వారి కోసం మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తోంది. లేదా ఆయా కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉంటే విద్యార్థుల ఆప్షన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని యోచనలో ఉంది. దీనిపై 24న తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement