గ్రేటర్‌లో పార్టీ ఎలా ఉంది? | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో పార్టీ ఎలా ఉంది?

Published Tue, Jan 26 2016 4:05 AM

గ్రేటర్‌లో పార్టీ ఎలా ఉంది? - Sakshi

మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు
నియోజకవర్గాల వారీగా పరిస్థితిపై ఆరా
సర్వే ఫలితాలు, బహిరంగ సభ,
ఈ-పబ్లిసిటీపై చర్చ హరీశ్‌రావు గైర్హాజరు

 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను సవాలుగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్ పక డ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో నగరంలో పార్టీ పరిస్థితిపై గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. మంత్రులతో ఆయన సోమవారం సీఎం అధికారిక నివాసంలో మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు రెండు గంటలపాటు సమీక్ష జరిపారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు.. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు మినహా మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు. నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున హరీశ్‌రావు ఈ సమావేశానికి రాలేదని సమాచారం.

ఈ నెల 30న కేసీఆర్ బహిరంగ సభను టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ఈ సభకు ఏర్పాట్లు, దీన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమీక్ష జరిపారని తెలిసింది. అలాగే కేసీఆర్ ఈ-పబ్లిసిటీకి సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

 ప్రధానంగా జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో కనీసం వంద స్థానాల్లో విజయం సాధించాలని టీఆర్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారం, పార్టీ జరిపించిన సర్వేల ద్వారా వచ్చిన వివరాలను ముందు పెట్టుకొని సీఎం కేసీఆర్ మంత్రులతో సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల వారీగా ఏ డివిజన్లలో బలహీనంగా ఉన్నాం, అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రులకు సూచించారని సమాచారం.

మంత్రులందరికీ ప్రచార బాధ్యతలు అప్పజెప్పినందున నేరుగా వారితోనే సమీక్ష జరిపి, ప్రచారంలో వెనకబడిన వారి గురించీ ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశం వివరాలను గోప్యంగా ఉంచారు. పార్టీ యంత్రాం గం, ఇతర ఏజెన్సీల ద్వారా జరిపించిన దాదాపు ఆరు సర్వేలు, వాటి ఫలితాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది.
 
 లోపాలపైనా చర్చ
 గ్రేటర్‌లో అభ్యర్థుల ప్రకటనకు ముందు ఉన్నంత ఊపు ఆ తర్వాత తగ్గిందని, కొందరు మంత్రులు అనుకున్నంత స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదని, ఆయా డివిజన్లలో ప్రచారంలో స్థానికులను కలుపుకునిపోవడంలో ఆయా ఇన్‌చార్జీలు శ్రద్ధ తీసుకోవడం లేదని, తమ ప్రాంతాలకు పిలిపించుకున్న నేతలతోనే ప్రచారంలో పాల్గొంటున్నార న్న తదితర లోపాలపైనా చర్చించారని తెలిసింది. కాగా, డివిజన్ల అభివృద్ధి కోసం చేయాల్సిన హామీలు, అభ్యర్థుల ఆర్థిక అవసరాలు, సాయం వంటి అం శాలపైనా సమీక్ష జరిగిందని వినికిడి. మొత్తంగా డివిజన్ల వారీగా, మంత్రుల వారీ గా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ సూచనలు చేశారని సమాచారం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement