విలువైన స్థిరాస్తులకు సంబంధించిన కేసుల్లో ఇరుపక్షాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నప్పుడు కింది కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
విలువైన స్థిరాస్తుల కేసుల్లో కింది కోర్టుకు హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: విలువైన స్థిరాస్తులకు సంబంధించిన కేసుల్లో ఇరుపక్షాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నప్పుడు కింది కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరుపక్షాల్లో ఎవరైనా ఒకరు ఏదైనా కారణంతో విచారణకు హాజరు కాకపోతే సహనంతో వ్యవహరించి మరో అవకాశం ఇవ్వాలే తప్ప, ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదంది. ఈ మేరకు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల తీర్పునిచ్చారు.
తన ఆస్తి వివాదంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చిందని, వాటిని రద్దు చేయాల ని పి.బుచ్చన్న అనే వృద్ధుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఏకపక్ష వాదనలు విని ఉత్తర్వులిచ్చినట్టు నిర్థారిస్తూ, కింది కోర్టు ను తప్పుపట్టారు. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ, తిరిగి ఇరుపక్షాల వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు.