ఎమ్మెల్యే రోజా పిటిషన్పై నేడు విచారణ | high court enquiries on mla roja petition | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రోజా పిటిషన్పై నేడు విచారణ

Feb 15 2016 10:37 AM | Updated on Oct 29 2018 8:08 PM

ఎమ్మెల్యే రోజా పిటిషన్పై నేడు విచారణ - Sakshi

ఎమ్మెల్యే రోజా పిటిషన్పై నేడు విచారణ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని ఆమె పిటిషన్లో కోరారు.

శాసనసభ్యురాలిగా అసెంబ్లీలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారన్నారు. ఈ పిటిషన్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు, కర్నూలు మున్సిపల్ ఎన్నికలు, వరంగల్ ఎన్కౌంటర్ లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement