సిటీ పోలీసులకు చుక్కెదురు

high court cancelled aayubkhan's Compulsory orders - Sakshi

అయూబ్‌ఖాన్‌ నిర్బంధ ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: అయూబ్‌ఖాన్‌ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించిన హైదరాబాద్‌ సిటీ పోలీసులకు హైకోర్టులో చుక్కెదురైంది. అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ గతేడాది జనవరి 25న జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టే సింది. న్యాయమూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కెయిత్, జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద్‌రావుల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.

తన తండ్రి అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను, వాటిని సమర్థిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి జారీ చేసిన ఉత్తర్వులనూ కొట్టేయాలని కోరుతూ షాబాజ్‌ అనే వ్యక్తి హైకోర్టులో గతేడాది పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ కెయిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడ్డి, బి.మోహనారెడ్డి వాదనలు వినిపించారు.

పీడీ యాక్ట్‌ ఉత్తర్వులు, వాటిని సమర్థిస్తూ జారీ అయిన ఉత్తర్వులు ఇంగ్లిష్‌లోనే ఉన్నాయని, కాని అయూబ్‌ఖాన్‌ మాతృభాష ఉర్దూ అని వారు కోర్టుకు వివరించారు. నిబంధనల ప్రకారం నిర్బంధానికి గురైన వ్యక్తికి తెలియని భాషలో ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇంగ్లిష్‌రాని అయూబ్‌ఖాన్‌ తన నిర్బంధంపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించుకునే అవకాశం కోల్పోయారని, ఇది అతని హక్కులను హరించడమేనని వివరించారు. 27.2.17న సలహా బోర్డు ముందు అయూబ్‌ఖాన్‌ను ప్రవేశపెట్టిన అధికారులు, మార్చి 3న అతనికి ఉర్దూలో నిర్బంధ ఉత్తర్వులు అందజేశారని కోర్టుకు నివేదించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top