Manneguda Vaishali Kidnap Case: High Court Dissolve Pd Act On Naveen - Sakshi
Sakshi News home page

మరోసారి తెరపైకి మన్నెగూడ వైశాలి కిడ్నాప్‌ కేసు

Jun 12 2023 2:28 PM | Updated on Jun 12 2023 3:27 PM

Manneguda Vaishali Kidnap Case: High Court Dissolve Pd Act On Naveen - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మన్నెగూడ వైశాలి కిడ్నాప్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వైద్య విద్యార్థినిని అపహరించిన కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిపై నమోదైన పీడీ యాక్ట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో గతేడాది వైశాలి కిడ్నాప్‌ కేసు అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలిని నవీన్‌ డిసెంబర్‌ 9న కిడ్నాప్‌ చేశాడు తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై, అడ్డు వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారు. అనంతరం ఆమెను వదిలేశాడు.

వైశాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్‌ రెడ్డిని సైతం పోలీసులు గోవాలో అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు ఇటీవల నవీన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు రిమాండ్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ నవీన్ రెడ్డి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేసాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నవీన్ రెడ్డిపై విధించిన పీడీ యాక్ట్‌ను కొట్టివేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
చదవండి: మిస్టరీగా వికారాబాద్‌ శిరీష కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement