గణపయ్యలకు చేనేత కండువాలు | Sakshi
Sakshi News home page

గణపయ్యలకు చేనేత కండువాలు

Published Fri, Aug 18 2017 1:15 AM

గణపయ్యలకు చేనేత కండువాలు

ఖైరతాబాద్‌ గణేశ్‌కు 25 మీటర్ల పొడవు
బాలాపూర్‌ వినాయకుడికి 12.25 మీటర్లు


భూదాన్‌ పోచంపల్లి:  హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, బాలాపూర్‌లో ప్రతిష్ఠించే మహాగణపతి మెడలో వేసే కండువాలను భూదాన్‌ పోచంపల్లి మండల పరిధిలోని హ్యాండ్లూమ్‌ పార్కులో తయారు చేసి చేనేత కార్మికులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. రెండేళ్లుగా హ్యాండ్లూమ్‌ పార్కు పాలకవర్గం ఖైరతాబాద్‌ మహా గణ పతికి  కండువాను తయారు చేసి బహూ కరిస్తున్నారు.

ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగిస్తూ 25 మీటర్ల భారీ కండువాను తయారు చేస్తున్నారు. ఎరుపు రంగు గల కండువాలో ఓం గణేశాయ నమః, ఓంకారం, శివలింగం, త్రిశూలం, తామరపువ్వు, లడ్డూలు, స్వస్తిక్‌ గుర్తు, పూర్ణకుంభంతోపాటు పోచంపల్లి హ్యాం డ్లూమ్‌ పార్కును ఆంగ్లంలో షార్ట్‌కట్‌ రూపంలో పీహెచ్‌పీ వచ్చే విధంగా ఇరువైపులా జరీతో గులాబీ రంగులో తయారు చేస్తున్నారు. బాలాపూర్‌ గణేశుడికి కూడా మొదటిసారిగా 12.50 మీటర్ల పొడవున్న పసుపు వర్ణంలో కండువాను తయారు చేశారు.

15 రోజులు శ్రమించి..
కండువాను తయారు చేసే ముందు పార్కు పాలకవర్గం ప్రత్యేక పూజలు నిర్వహి స్తుంది. కార్మికుడు, డిజైనర్‌ కండువా పని పూర్తయ్యే వరకు ఎంతో నియమ, నిష్టలతో ఉంటారు. మొత్తం 10 మంది చేనేత కళాకారులు 15 రోజులు శ్రమించి కండు వాను తయారు చేశారు. వినాయక చవితి రోజున స్థానిక మార్కండేశ్వరస్వామి దేవాలయంలో కండువాను ఉంచి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఖైరతాబాద్‌లోని గణపతికి బహూకరిస్తారు. కాగా, వినా యకుడికి కండువా బహూకరి స్తున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని హ్యాండ్లూమ్‌ పార్కు చైర్మన్‌ కడవేరు దేవేందర్‌ చెప్పారు.

Advertisement
Advertisement