దుబాయ్ నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలు జీనాత్ బేగం వద్ద నుంచి అర కిలో బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలు జీనత్ బేగం వద్ద నుంచి అర కిలో బంగారాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో దిగిన బేగం లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె లగేజీలో అరకేజీ బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె వద్ద నుంచి ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని అధికారుల సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.


