టీఆర్‌ఎస్ గ్రేటర్ ప్రధానకార్యదర్శిగా అనుముల | Greater Telangana Secretary of State anumula | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ గ్రేటర్ ప్రధానకార్యదర్శిగా అనుముల

Sep 18 2013 1:41 AM | Updated on Sep 1 2017 10:48 PM

టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా అనుముల నర్సింహ్మారెడ్డిని నియమితులయ్యారు.

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా అనుముల నర్సింహ్మారెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు, నగర అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ నియామక పత్రాన్ని మంగళవారం ఆయనకు అందించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కుషాయిగూడకు చెందిన అనుముల పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగంలోనూ, కాప్రా సర్కిల్ పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. కుషాయిగూడ బస్ డిపో కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం అనుముల చేసిన కృషికి గుర్తింపుగా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రధానకార్యదర్శిగా నియమించినట్టుగా ఎమ్మెల్యే కె.తారక రామారావు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులు బాల్క సుమన్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భేతి సుభాష్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ నాయకులు మురళీ పంతులు, కనకరాజు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement