నగరం పలు సమస్యలతో సతమతమవుతున్నా ఏ చర్యలూ తీసుకోని జీహెచ్‌ఎంసీ.. ప్రజల ముక్కుపిండి మరీ ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అత్యుత్సాహం కనబరుస్తోంది.
సాక్షి, సిటీబ్యూరో : నగరం పలు సమస్యలతో సతమతమవుతున్నా ఏ చర్యలూ తీసుకోని జీహెచ్‌ఎంసీ.. ప్రజల ముక్కుపిండి మరీ ఆస్తిపన్ను వసూలు చేసేందుకు అత్యుత్సాహం కనబరుస్తోంది. రెడ్‌నోటీసుల అస్త్రాన్ని వెలికి తీసి.. వచ్చేనెల నుంచి జారీ కి చర్యలు చేపట్టింది. సర్కిళ్ల వారీగా మొండి బకాయిదారులకు వీటిని జారీ చేయాలని డీఎంసీలు, వాల్యుయేషన్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని దాదాపు లక్షమందికి ఈ నోటీసులు వచ్చేనెల రెండోవారం నుంచి పంపిణీ కానున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను ద్వారా రూ. 779 కోట్లు వ సూలు చేసిన జీహెచ్‌ఎంసీ.. ఈ ఆర్థిక సంవత్సరం చేపట్టిన వివి ధ చర్యల వల్ల డిమాండ్ ఏకంగా రూ. 1700 కోట్ల కు చేరింది. ఇందులో రూ. 1000 కోట్లయినా వ సూలు చేయాలనేది లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికి దాదాపు రూ. 382 కోట్లు వసూలు చేశా రు. గతేడాది ఇదేరోజుతో పోలిస్తే దాదాపు రూ. 50 కోట్లు అధికంగా వసూలైనా.. ఈ ఆర్థిక సంవత్సరం భారీ లక్ష్యం కళ్లముందుండటం.. 5 నెలలే ఉండటంతో వసూళ్లకు సిద్ధమవుతున్నారు.
మొండి బకాయిదార్లపై చర్యలు
జీహెచ్‌ఎంసీలో రెండు విడతలుగా ఆస్తిపన్ను వ సూలు చేస్తున్నారు. మొదటి విడత చెల్లింపులకు జూలై నెలాఖరు, రెండో విడత చెల్లింపులకు అక్టోబర్ 15 గడువు. రెండు గడువులూ ముగిసిపోవడంతో రెడ్ నోటీసులకు సిద్ధమయ్యారు. తాజా గణాంకాల మేరకు జీహెచ్‌ఎంసీలో 13,28,000 ఆస్తిపన్ను చెల్లింపుదారులుండగా.. వీరిలో మూడేళ్లుగా ఆస్తిపన్ను బకాయిలున్నవారు దాదాపు లక్షమంది ఉన్నారు. ఇక, కోర్టుల కెళ్లిన భవన యజ మానులు దాదాపు 500 మంది ఉన్నారు. వీరి నుంచి రూ. 30 కోట్ల బకాయిలున్నట్లు అంచనా. వారికి సైతం రెడ్‌నోటీసులు జారీ చేయనున్నారు.