'జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి టీఆర్ఎస్ పతనం' | G Kishan reddy takes on trs party | Sakshi
Sakshi News home page

'జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి టీఆర్ఎస్ పతనం'

Nov 24 2015 1:48 PM | Updated on Sep 3 2017 12:57 PM

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో స్పందించారు.

హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో స్పందించారు. వరంగల్ ఉప ఎన్నికలో ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకో లేకపోయామని ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు నిరాశ కలిగించాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.

మజ్లిస్ అభ్యర్థిని మేయర్ చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ నాలుగున్నర లక్షల ఓట్లపైగా భారీ ఆధిక్యంతో గెలుపోందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement