ఎస్‌ఐ ఆత్మహత్య టీఆర్‌ఎస్ అవినీతికి పరాకాష్ట: నాగం | Former Minister Nagam Janardhan Reddy Comments on SI suicide | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ ఆత్మహత్య టీఆర్‌ఎస్ అవినీతికి పరాకాష్ట: నాగం

Aug 19 2016 1:29 AM | Updated on Oct 3 2018 7:31 PM

ఎస్‌ఐ ఆత్మహత్య టీఆర్‌ఎస్ అవినీతికి పరాకాష్ట: నాగం - Sakshi

ఎస్‌ఐ ఆత్మహత్య టీఆర్‌ఎస్ అవినీతికి పరాకాష్ట: నాగం

రాష్ట్రంలో అవినీతి తీవ్రంగా పెరిగిందనడానికి మెదక్ జిల్లాలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకోవడం పరాకాష్ట అని...

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అవినీతి తీవ్రంగా పెరిగిందనడానికి మెదక్ జిల్లాలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకోవడం పరాకాష్ట అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్‌పీ, సీఐతో సహా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తన సూసైడ్ నోట్‌లో ఎస్‌ఐ రాసినా ఇంకా కేసు నమోదు చేయకపోవడం.. అవినీతికి ప్రభుత్వమే అండగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనమన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement