నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. నిన్న,మొన్నటి వరకు కలరా, డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో సతమతమైన సిటీజన్లు తాజాగా స్వైన్‌ఫ్లూతో బెంబేలెత్తిపోతున్నారు.
స్వైన్‌ఫ్లూ కలకలం
Aug 1 2016 10:17 PM | Updated on Sep 4 2017 7:22 AM
► బోయగూడకు చెందిన నాలుగేళ్ల బాలికకు గాంధీలో చికిత్స
► అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసుగా నమోదు.. ఐపీఎంకు నమూనాలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. నిన్న,మొన్నటి వరకు కలరా, డెంగీ, మలేరియా వంటి జ్వరాలతో సతమతమైన సిటీజన్లు తాజాగా స్వైన్‌ఫ్లూతో బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా బోయగూడకు చెందిన రేవతి(4) తీవ్రమైన జ్వరం, తలనొప్పి, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు సోమవారం ఆమెను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసుగా నమోదు చేసుకుని చికిత్స అందిస్తున్నారు. బాలిక నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కో సం ఐపీఎంకు పంపారు. ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రుస్తున్న ఎడతెరపి లేని వర్షాలు, చలిగాలుల కారణంగా వాతావరణంలో హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ బలపడుతోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సులభంగా విస్తరించే అవకాశం ఉండటంతో బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిజాలు.. నివారణలు..
► తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది.
► ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్ వాతావరణంలో రెండుగంటలకుపైగా జీవిస్తుంది.
► గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు వ్యాపించే అవకాశం ఉంది.
► సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వేన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి.
► ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
► ముక్కుకు మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.
► వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.
► జన సముహ ప్రాంతాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. తీర్ధయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.
► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు.
► చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు.
Advertisement


