నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచనల మేరకు ఫిలింనగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పలువురు ముందుకు వచ్చారు.
బంజారాహిల్స్ (హైదరాబాద్) : నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచనల మేరకు ఫిలింనగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పలువురు ముందుకు వచ్చారు. తమ వంతు సాయంగా సినీ నిర్మాత డి.సురేష్‌బాబు రూ.2.50 లక్షల చెక్కును, ప్రముఖ వ్యాపారవేత్త కె. రఘురామకృష్ణంరాజు లక్ష రూపాయల చెక్కును శుక్రవారం సెక్టార్ ఎస్‌ఐ గోవర్ధన్ రెడ్డికి అందజేశారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ఆయన తెలిపారు.