ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో విడతలవారీగా విజయవాడకు వెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
జూన్ 15 కల్లా 4 వేల మందిని, జూలైకి మరో 3 వేల మందిని, ఆగస్టుకు మరో 3వేల మంది ఉద్యోగులను తరలిస్తామని చెప్పారు. వెలగపూడిలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండు అంతస్తులతో పాటు కొత్తగా మరో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు.