breaking news
Employees committees
-
మంత్రి నారాయణతో ఉద్యోగ సంఘాల భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో విడతలవారీగా విజయవాడకు వెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకారం తెలిపినట్టు తెలిసింది. ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. జూన్ 15 కల్లా 4 వేల మందిని, జూలైకి మరో 3 వేల మందిని, ఆగస్టుకు మరో 3వేల మంది ఉద్యోగులను తరలిస్తామని చెప్పారు. వెలగపూడిలో ప్రస్తుతం నిర్మిస్తున్న రెండు అంతస్తులతో పాటు కొత్తగా మరో రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. -
కేసీఆర్ మర్యాద నేర్చుకో
టీఆర్ఎస్ అధినేతపై ఏపీ పీసీసీ నేతల ఫైర్ సాక్షి, హైదరాబాద్: ‘‘కేసీఆర్.. మేమూ ఆంధ్రావాళ్లమే.. మా ఉద్యోగ సంఘాల తరఫున సవాల్ విసురుతున్నాం. రాజ్యాంగానికి లోబడి మాట్లాడండి... మర్యాదగా ప్రవర్తించండి. ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించొద్దు. మీ రాష్ట్రం.. మీరేమైనా చేసుకోండి.. మా వాళ్లనంటే ఊరుకునేది లేదు’’ అని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనీయమని కేసీఆర్ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యల్ని ఏపీపీసీసీ నేతలు తప్పుబట్టారు. మాజీ మంత్రులు మాణిక్య వరప్రసాద్, శైలజానాథ్, ఎమ్మెల్సీ పాలడుగు, ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు, మరో ప్రతినిధి గౌతమ్‌లు శుక్రవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.