8 జిల్లాల్లో 177 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది.
- వ్యవసాయశాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు దాదాపు 2.89 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ మంగళవారం తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. 8 జిల్లాల్లో 177 మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. వరి, పత్తి, కంది, సోయా, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని తన నివేదికలో తెలిపింది.
వ్యవసాయాధికారి సస్పెన్షన్
మంగళవారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివిధ పంటలను పరిశీలించారు. కానీ అక్కడి మండల వ్యవసాయాధికారి రాజలింగం వర్షాలు కురిసిన ఈ వారం రోజులు విధుల్లో లేరని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి పోచారం వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాల్సిందిగా కమిషనర్ ప్రియదర్శినిని ఆదేశించారు.
వర్షాలకు ఆరుగురి మృతి
సోమవారం నుంచి మంగళవారం ఉద యం వరకు కురిసిన వర్షాలకు మెదక్ జిల్లా లో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్ద రు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు చనిపోయారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.