క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో బెట్టింగ్ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు ఇంటిపై దాడి చేశారు. వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.4 లక్షల నగదు, ఐదు సెల్ ఫోన్లతోపాటు రెండు టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.