ఫీజుల నియంత్రణపై అఖిలపక్షం వేయండి | CPM appeal to government on Fees regulation | Sakshi
Sakshi News home page

ఫీజుల నియంత్రణపై అఖిలపక్షం వేయండి

Apr 21 2016 3:46 AM | Updated on Sep 5 2018 9:00 PM

ఫీజుల నియంత్రణపై అఖిలపక్షం వేయండి - Sakshi

ఫీజుల నియంత్రణపై అఖిలపక్షం వేయండి

ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై చర్చించేం దుకు వెంటనే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్:
ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై చర్చించేం దుకు వెంటనే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. పోలీసు తనిఖీలను ప్రైవేట్ యాజమాన్యాలు వ్యతిరేకించాలి తప్ప, పరీక్ష కేంద్రాలను అనుమతించమనే వైఖరి సరైంది కాదని పేర్కొం ది. ప్రభుత్వ నియమ, నిబంధనలను ప్రైవేట్ విద్యాసంస్థలు అమలు చేస్తున్న తీరుపై రెగ్యులర్‌గా తనిఖీలు చేయడాన్ని తమ పార్టీ సమర్థిస్తున్నదని రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

అయితే ప్రభుత్వ విద్యారంగానికి చెందిన సంస్థలతో కాకుండా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సీబీసీఐడీ వంటి పోలీసు విభాగాలతో తనిఖీలు చేయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగాన్ని పరిరక్షించాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ప్రైవేట్ విద్యాలయాలపై ప్రభుత్వ విద్యావిభాగాల ద్వారా సమర్థంగా తనిఖీలు చేయించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్న సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement