హైకోర్టులో సీపీఐ నారాయణ పిల్ | cpi narayana luanched pil in high court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో సీపీఐ నారాయణ పిల్

Jun 23 2015 4:31 PM | Updated on Aug 31 2018 8:24 PM

హైకోర్టులో సీపీఐ నారాయణ పిల్ - Sakshi

హైకోర్టులో సీపీఐ నారాయణ పిల్

ప్రజాప్రతినిదుల విచ్చలవిడిగా అవినీతికి అడ్డుకట్టవేసేలా తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సీసీఐ సీనియర్ నేత నారాయణ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలుచేశారు.

హైదరాబాద్: ప్రజాప్రతినిదుల విచ్చలవిడిగా అవినీతికి అడ్డుకట్టవేసేలా తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సీసీఐ సీనియర్ నేత నారాయణ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలుచేశారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అవినీతికి పాల్పడటానికి కారణం ఇరు రాష్ట్రాల శాసనసభల స్పీకర్ల నిర్లక్ష్యమేనని నారాయణ తన పిటిషన్లో ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ను జాగృతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ అంశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్పీకర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ప్రతివాదులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడం, దీంతో సదరు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని పార్టీలు విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కలిపి వివిధ పార్టీలకు చెందిన డజను మందికిపైగా ఎమ్మెల్యేల అనర్హత ఫైళ్లు ఆయా రాష్ట్రాల స్పీకర్ల వద్ద పెండింగ్లో ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విషయంలో పూర్తి నిర్ణయం స్పీకర్లదే. అయితే ఈ అధికారాన్ని అడ్డంపెట్టుకొని అధికార పార్టీలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement