బ్రిజేష్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి | Congress leader Ponguleti demands for discussion on brijesh kumar tribunal verdict | Sakshi
Sakshi News home page

బ్రిజేష్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలి

Oct 23 2016 6:33 PM | Updated on Mar 18 2019 9:02 PM

కృష్ణా నదీ జలాల పంపకాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అసెంబ్లీలో చర్చించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపకాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అసెంబ్లీలో చర్చించాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన ట్రిబ్యునల్ తీర్పు ఉభయ తెలుగు రాష్ట్రాలకు నష్టమని చెప్పారు. ఈ తీర్పు వల్ల ప్రజలు నష్టపోతారని అన్నారు.

తీర్పును ప్రాధాన్యాంశంగా తీసుకుని చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సొంత డబ్బా కొట్టుకోవడానికి వస్తున్న సర్వేల ఫలితాలను లెక్కలోకి తీసుకోవద్దని కోరారు. అవి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తన కోసం చేయించుకున్న సర్వేలని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే ఎగువ రాష్ట్రాలకు అనుకూలమైన తీర్పు వచ్చిందని ఆరోపించారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement