పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమౌతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు.. హౌస్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమౌతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు.. హౌస్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం అయ్యారు. పార్లమెంట్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన మార్గనిర్దేశకత్వం చేసినట్లు సమాచారం. హైకోర్టు, ఇతర విభజన సమస్యలను టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్థావించనున్నట్లు తెలుస్తోంది.