చిత్రపురి కాలనీ సొసైటీ ఎన్నికలు ప్రారంభం | Chitrapuri - Cine Workers Cooperative Housing Society elections | Sakshi
Sakshi News home page

చిత్రపురి కాలనీ సొసైటీ ఎన్నికలు ప్రారంభం

Oct 25 2015 9:21 AM | Updated on Aug 13 2018 4:19 PM

బంజారాహిల్స్లోని చిత్రపురి కాలనీ సొసైటీ ఎన్నికలు ఆదివారం ఉదయం ప్రారంభమైనాయి.

హైదరాబాద్ : బంజారాహిల్స్లోని చిత్రపురి కాలనీ సొసైటీ ఎన్నికలు ఆదివారం ఉదయం ప్రారంభమైనాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానికులు ఎన్నికల కేంద్రం వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల బరిలో ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, తెలుగు సినీ వర్కర్స్ కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ నిలిచారు.

ఈ ఎన్నికలు ఈ రోజు మధ్యాహ్నం3.00 గంటల వరకు జరుగుతాయి. అనంతరం 3.30 గంటలకు కౌంటింగ్ నిర్వహించి... విజేతలను ప్రకటిస్తారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులు బంజారాహిల్స్లోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement