పిల్లల ఆరోగ్యంపైన దుష్ర్పభావం చూపే నాణ్యత లేని, గడువుతీరిన తినుబండారాల విక్రయించడం క్రిమినల్ చర్య కిందకు వస్తుందని భావించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెరిటేజ్ సంస్థకు మంగళవారం నోటీసులు జారీచేసింది.
హైదరాబాద్: పిల్లల ఆరోగ్యంపైన దుష్ర్పభావం చూపే నాణ్యత లేని, గడువుతీరిన తినుబండారాల విక్రయించడం క్రిమినల్ చర్య కిందకు వస్తుందని భావించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెరిటేజ్ సంస్థకు మంగళవారం నోటీసులు జారీచేసింది. జూన్ 20వతేదీలోగా దీనికి వివరణ ఇవ్వాలని సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌ను ఆదేశించింది.
సోమవారం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు స్వయంగా వనస్థలిపురంలోని హెరిటేజ్ సూపర్‌మార్కెట్‌లోని వస్తువుల నాణ్యతను పరిశీలించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన పిల్లలు తినే ఆహారపదార్థాలు, శీతల పానీయాల గడువు తీరిపోయినా విక్రయిస్తున్నట్లు గుర్తించి సదరు సంస్థకు నోటీసులు జారీ చేశారు.