చంద్రబాబుతో నేడు జగ్గీ వాసుదేవ్ భేటీ | Chandrababu Naidu today held a meeting with Juggy Vasudev | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో నేడు జగ్గీ వాసుదేవ్ భేటీ

Mar 27 2016 1:24 AM | Updated on Aug 14 2018 11:26 AM

చంద్రబాబుతో నేడు జగ్గీ వాసుదేవ్ భేటీ - Sakshi

చంద్రబాబుతో నేడు జగ్గీ వాసుదేవ్ భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆదివారం భేటీ కానున్నారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఆదివారం భేటీ కానున్నారు. హైదరాబాద్ మదీనగూడలోని చంద్రబాబు ఫాంహౌస్‌లో సుమారు గంటకు పైగా ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీలో చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిసింది. గతేడాది జనవరి చివరివారంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీసెస్ అధికారులకు యోగా శిక్షణ ఇచ్చారు. జగ్గీ వాసుదేవ్ సంస్థలు ఏర్పాటుచేసేందుకు అనువుగా కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమిని ఇచ్చేందుకూ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 నేడు బీసీ సబ్‌ప్లాన్‌పై చంద్రబాబు సమావేశం : సీఎం చంద్రబాబు ఆదివారం టీడీపీలోని బీసీ ప్రజా ప్రతినిధులతో  బీసీ ఉప ప్రణాళికపై సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

 చంద్రబాబును కలిసిన అల్లు అరవింద్ : సీఎంను సినీ నిర్మాత అల్లు అరవింద్ శనివారం కలిశారు. తన బావ, కాంగ్రెస్ ఎంపీ కొణిదెల చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు. అందుకు ఆయన అంగీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement