పనామాలో బాబు బినామీ

పనామాలో బాబు బినామీ


పనామా పేపర్స్‌ తాజాగా విడుదల చేసిన జాబితాతో టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ మోటపర్తి శివరామ వర ప్రసాద్‌ (67) పేరు బయటపడింది. (చదవండి...పనామా లీకుల్లో హెరిటేజ్ 'లింకు') ఈయన వృత్తిరీత్యా వ్యాపారి. ప్రవృత్తి రీత్యా చంద్రబాబు అనుయాయుడు. ఎంపీ హోల్డింగ్స్‌ అసోసియేట్స్‌, బాలీవార్డ్‌ లిమిటెడ్‌, బిట్‌ కెమీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు తేలింది. పనామాలో మూడుసార్లు ప్రసాద్‌ పేరు ప్రస్తావవకు వచ్చింది. బ్రిటిష్ వర్జిన్‌ ఐలాండ్స్‌, పనామా, ఈక్వెడార్‌లో మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఎంపీ హోల్డింగ్స్‌ అసోసియేట్స్‌, బాలీవార్డ్‌ లిమిటెడ్‌, బిట్‌ కెమీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీలతో సంబంధమున్న ఆయన పేరు పనామా పేపర్స్‌లో మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. వర ప్రసాద్‌ పేరు బయటకు రావడంతో... చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. వరప్రసాద్‌ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే.... ఆయన బినామీ ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. అటు వరప్రసాద్‌ పేరు బయటకు రావడంతో... టీడీపీ నేతల్లోనూ ఆందోళన మొదలైనట్లు సమాచారం.ప్రసాద్‌ కుమారుడు సునీల్‌ కూడా బిట్‌ కెమీ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా వెల్లడించింది. సునీల్‌.. అమెరికా, హైదరాబాద్‌లో స్టార్టప్‌ కంపెనీల్లో ఈ డబ్బును ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద్‌ ప్రవాస భారతీయుడు కాగా... హైదరాబాద్‌లో కొన్ని కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటు ఘనా, టోగో, అమెరికాలో ప్రసాద్‌కు వ్యాపారాలు ఉన్నాయి. ప్రసాద్‌ 2014 నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.పనామా లిస్ట్‌లో తన పేరు రావడంపై ప్రసాద్‌ స్పందించారు. తాను ప్రవాస భారతీయుడునని... గత 30 ఏళ్లుగా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్‌లో కూడా కంపెనీలు ఉన్నాయన్నారు. పనామా వ్యవహారం గురించి తనకు తెలియదన్నారు. ఈ వ్యవహారాన్ని కంపెనీ సిబ్బంది, లాయర్లు చూసుకొంటారని చెప్పారు. తన వ్యాపార లావాదేవీలన్నీ చట్టబద్దంగా ఉన్నాయన్నారు. కాని పనామా ప్రకటించిన లిస్ట్‌లో మాత్రం పన్ను ఎగవేసే కంపెనీలతో సంబంధం ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. కాగా ఈ వ్యవహారంపై శివరామ వరప్రసాద్ కుమారుడు సునీల్ మాట్లాడుతూ తమ కంపెనీలు చట్టబద్దమైనవని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top