ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలతోపాటు కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్: ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలతోపాటు కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. విదేశాలకు వెళ్లే వారి డేటా బేస్ తో పాటు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ను రూపొందిస్తున్నామని అన్నారు.
ఎన్నారైల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ను ఏర్పాటుచేస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ నాన్ రెసిడెంట్ వారికోసం సెంటర్ ఫర్ నాన్ తెలంగాణ అఫైర్స్ కమిటీని, జిల్లాలో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు.