చిరంజీవితో సి.రామచంద్రయ్య భేటీ | c.ramachandraiah met chiranjeevi over mudragada deeksha | Sakshi
Sakshi News home page

చిరంజీవితో సి.రామచంద్రయ్య భేటీ

Jun 11 2016 9:33 AM | Updated on Jul 30 2018 6:25 PM

చిరంజీవితో సి.రామచంద్రయ్య భేటీ - Sakshi

చిరంజీవితో సి.రామచంద్రయ్య భేటీ

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య శనివారం రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో సమావేశం అయ్యారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య శనివారం రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో సమావేశం అయ్యారు. కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్ట్ అయినవారిని తక్షణమే విడుదల చేయాలంటూ కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్షపై ఈ భేటీలో చర్చ జరిపినట్లు సమాచారం. ముద్రగడ దీక్ష నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

కాగా ముద్రగడ కొద్దిరోజుల క్రితం పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణలను కలిసి కాపు ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement