నగరంలోని సైదాబాద్ పూసలబస్తీలో అర్థరాత్రి దారుణం జరిగింది.
	హైదరాబాద్: నగరంలోని సైదాబాద్ పూసలబస్తీలో అర్థరాత్రి దారుణం జరిగింది.  అరవింద్ అనే వ్యక్తి తన ఇద్దరు సొంత చెల్లెళ్లను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం నిందితుడు అరవింద్ పోలీసు స్టేషన్ వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.    
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
