పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గేట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను టార్గేట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. పార్క్ చేసి ఉన్న వాహనాలలోని సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, నగదు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 23 వేల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.