అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు... పోలీసుల దాడులు | bike racing in jubilee hills checkpost | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు... పోలీసుల దాడులు

May 22 2016 8:41 AM | Updated on Sep 4 2017 12:41 AM

అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులకు బంజారాహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు.

హైదరాబాద్ : అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులకు బంజారాహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు. శనివారం అర్ధరాత్రి పలువురు యువకులు జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు దిగారు. 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం 25 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సదరు యువకులు తల్లిదండ్రులను స్టేషన్కి పిలిపించి... వారి... సమక్షంలో యువకులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement