బీసీ బిల్లుకు చొరవ తీసుకోవాలి | BC Welfare Association wants to BC bill | Sakshi
Sakshi News home page

బీసీ బిల్లుకు చొరవ తీసుకోవాలి

Sep 16 2016 3:09 AM | Updated on Sep 17 2018 5:36 PM

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని...

రాజకీయ పార్టీలను కోరిన బీసీ సంక్షేమ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు. గురువారం ఇక్కడ పలువురు నేతలను కలిశారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎస్.పి.సింగ్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, లోక్ జనశక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తదితరులను కలసి వినతిపత్రాన్నిచ్చారు. బీసీ డిమాండ్లకు మద్దతు కూడగట్టేందుకు త్వరలోనే కర్ణాటక, బిహార్, యూపీ, మహారాష్ట్ర, హరియాణాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. బృందంలో శ్రీనివాస్‌గౌడ్, శివనాగేశ్వరరావు, అనిల్, ప్రొఫెసర్ ఎం.బాగయ్య, రాజుగౌడ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement