30న ఏపీ, తెలంగాణల్లో కలెక్టరేట్ల ముట్టడి | BC Welfare Association protests at Collectorates on august 30th over reservations | Sakshi
Sakshi News home page

30న ఏపీ, తెలంగాణల్లో కలెక్టరేట్ల ముట్టడి

Aug 27 2016 2:20 AM | Updated on Sep 4 2017 11:01 AM

బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ఈ నెల 30న ఏపీ, తెలంగాణల్లో కలెక్టరేట్ల ముట్టడి.

ప్రకటించిన బీసీ సంక్షేమసంఘం
 సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ఏపీ, తెలంగాణల్లో కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమసంఘం ప్రకటించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఇరు రాష్ట్రాల సీఎంలు అఖిలపక్షాలతో ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభ ల్లో రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు మాత్రం ఎందుకు కల్పించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే, సంఘ నేత ఆర్.కృష్ణయ్య, తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ అధ్యక్షుడు కె.శంకరరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement