టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో బీసీ డిమాండ్లపై తీర్మానం | BC plenary resolution on the demands of the TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో బీసీ డిమాండ్లపై తీర్మానం

Apr 10 2017 2:26 AM | Updated on Sep 5 2017 8:22 AM

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బీసీ డిమాండ్లపై చర్చించి, తీర్మానం చేయాలని ప్లీనరీ సమావేశాల తీర్మానాల

ప్లీనరీ తీర్మానాల కమిటీకి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో బీసీ డిమాండ్లపై చర్చించి, తీర్మానం చేయాలని ప్లీనరీ సమావేశాల తీర్మానాల కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు (కేకే)కు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం కేకేను కలసి బీసీల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసింది.

బీసీలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు, ప్రభుత్వ నామినేటెడ్‌ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో బీసీలకు 50 శాతం పదవులు, హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో బీసీభవన్‌ నిర్మించాలని విజ్ఞప్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement