పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచుతూ గతంలో సర్కార్ తీసుకున్న నిర్ణయానికి శాసనసభ ఆమోదముద్ర వేసింది.
తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచుతూ గతంలో సర్కార్ తీసుకున్న నిర్ణయానికి శాసనసభ ఆమోదముద్ర వేసింది. పెట్రోల్‌పై 31 శాతం నుంచి 35.2శాతం, డీజిల్‌పై 22.5 శాతం నుంచి 27 శాతానికి వ్యాట్ పెంచుతూ చేసిన చట్ట సవరణలను విపక్ష పార్టీల వ్యతిరేకత మధ్య సోమవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.
వ్యాట్ చట్టానికి సవరణల బిల్లులను వాణిజ్య పన్నుల మంత్రి శ్రీనివాస్ యాదవ్ శాసనసభలో ప్రవేశపెట్టగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎంలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమయ్యాయని, అయితే ప్రభుత్వం వ్యాట్‌ను పెంచడంతో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదని ఆక్షేపిం చాయి. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పథకాల అమలు, గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను రూ.1200 నుంచి రూ.101కి తగ్గింపు లాంటి జీహెచ్‌ఎంసీ, మునిసిపల్ చట్టాలకు చేపట్టిన సవరణలను మాత్రం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.