ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను కమిషన్ దాదాపు ఒక కొలిక్కి తెచ్చింది.
వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసిన అధికారులు.. ఈసారి గ్రూప్-3కీ సిలబస్ రూపకల్పన
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను కమిషన్ దాదాపు ఒక కొలిక్కి తెచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు తుది ముసాయిదా సిలబస్‌ను కమిషన్ అధికారులు దాదాపు ఖరారు చేశారు. ఈ సిలబస్‌ను కమిషన్ శుక్రవారం తన అధికారిక వెబ్‌సైట్ ‘పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో అప్‌లోడ్ చేసింది. వెబ్‌సైట్లో ఫైనల్ సిలబస్‌గా పేర్కొన్నప్పటికీ దీనికి స్వల్పంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది సిలబస్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తేనున్నామని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి.
2011 గ్రూప్1 పోస్టుల్లో కోత!: 2011 గ్రూప్1 నోటిఫికేషన్‌లో పేర్కొన్న వాటిల్లోని దాదాపు 30 పోస్టులకు కోతపెట్టాలని ఏపీపీఎస్సీ చూస్తోందని ఆ గ్రూప్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.