
'బాబు తీరుపై 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి'
చంద్రబాబు తీరుపై 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని రఘువీరారెడ్డి అన్నారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన రఘువీరారెడ్డి.. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా డిసెంబర్ 23న వెలగపూడిలో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అవినీతిలో ఏపీని నంబర్ వన్ చేసిన ఘనత చంద్రబాబుదే అని, ఆయన తీరుపై 100 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని రఘువీరారెడ్డి అన్నారు.