ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రభుత్వ శాఖలన్నీ తరలుతున్న నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏపీ స్టేట్ హజ్ కమిటీ కార్యాలయాన్ని కూడా త్వరలో విజయవాడకు తరలిస్తున్నట్లు ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ మొమిన్ అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు.
హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రభుత్వ శాఖలన్నీ తరలుతున్న నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏపీ స్టేట్ హజ్ కమిటీ కార్యాలయాన్ని కూడా త్వరలో విజయవాడకు తరలిస్తున్నట్లు ఏపీ స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ మొమిన్ అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని ఏపి హజ్‌కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఏడాది నుంచి అమరావతి గన్నరం ఎయిర్ పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే హజ్ హౌస్ నిర్మాణం కోసం కడపలో సుమారు 12 ఎకరాల భూమిని కేటాయించడంతో రూ.12 కోట్లు విడుదల చేశారన్నారు. అమరావతిలో సైతం హజ్‌హౌస్ నిర్మాణం కోసం స్థల గుర్తింపు కసరత్తు కొనసాగుతుందని ఆయన వివరించారు.