వడదెబ్బ మృతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సోమవారం పలు సమస్యలపైన విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం అయింది.
విజయవాడ: వడదెబ్బ మృతులకు పరిహారం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సోమవారం పలు సమస్యలపైన విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా ప్రధానంగా వేసవి నేపథ్యంలో వచ్చే సమస్యలపై చర్చించింది.
వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ సరఫరాకు జిల్లాకు రూ.3కోట్లు మంజూరు చేసింది. చలివేంద్రాల్లో ఉచితంగా మజ్జిగ సరఫరా చేయాలని నిర్ణయించింది. మంచినీటి పథకాల పునరుద్ధరణకు రూ.200కోట్లు కేటాయించింది. 193 పీహెచ్సీలను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టూరిజం ప్రాజెక్టులకు 35 ఏళ్లపాటు లీజుకు భూకేటాయింపులు చేశారు.