ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 5 నుంచి నిర్వహించనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 5 నుంచి నిర్వహించనున్నారు. మార్చి 10న సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సోమవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.
మార్చి 8న వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. కాగా, అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్లోనే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.