నయీం కేసులో ఎంతటి వారికైనా చట్టప్రకారం శిక్షలు తప్పవని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
నల్లగొండ: నయీం కేసులో ఎంతటి వారికైనా చట్టప్రకారం శిక్షలు తప్పవని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తమ పార్టీ అయినా, వేరే పార్టీ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులపై ఆ పార్టీ లేనిపోని అపోహలు సృష్టిస్తోందని అన్నారు. కాగా, నయీం కేసులో యాదాద్రి సబ్ రిజిస్ట్రార్ వహీద్ అరెస్టు అయ్యాడు. బుధవారం వహీద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. భూముల రిజిస్ట్రేషన్ లో నయీంకు వహీద్ సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.