రాష్ట్రంలో సాగునీటి పారుదల అభివృధ్ధి సంస్థ (ఐడీసీ) ఆధ్వర్యంలో మరో 24 ఎత్తిపోతల పథకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది.
ఈ రబీలో కొత్తగా చేపట్టిన 74 పథకాల్లో 45 పూర్తిచేసి 70వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ 45 పథకాల్లో తొలుత 24 పథకాలను ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారానికి ప్రారంభించి 37వేల ఎకరాలకు నీరందించాలని ఐడీసీ భావిస్తోంది. ఇందులో జగిత్యాల జిల్లాలో రాయటప్నం, తిమ్మాపూర్, రాజారాం, జైనా, దొంతాపూర్ పథకాలు ఉండగా, పెద్దపల్లి జిల్లాలో కాశిపేట, కరీంనగర్‌లో ఉట్నూరు, భూపాలపల్లిలో గిద్దముత్తారం, నిజామాబాద్ జిల్లాలో గుమ్మిర్యాల, కుక్కునూరు, నిర్మల్‌లో వెల్మల్, సంగారెడ్డిలో బోగులంపల్లి, గద్వాల్‌లో అలంపూర్, సూర్యాపేట జిల్లాలో ఎర్రగుట్టతండా, చౌట్‌పల్లి, పొనుగోడు, మఠంపల్లి, ముదిమాణిక్యం, సున్యపహాడ్, గుట్టలగడ్డ, కొత్తగూడెం జిల్లాలో సింగిరెడ్డిపల్లి, అల్లపల్లి, పాములపల్లి, మోతెలో ఈ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జగిత్యాలలోని రాయపట్నం, తిమ్మాపూర్ పథకాలను అధికారులు ప్రారంభించారు.