చాకలి ఐలమ్మ వర్థంతి సభ పోస్టర్‌ను హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 10వ తేదిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి సభ పోస్టర్‌ను మంగళవారం ఎస్‌వీకేలో ఆవిస్కరించారు. పోస్టర్‌ను ఆవిష్కరించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ..చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయటంతో పాటు ఆమె వ ర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఐ.తిరుమలి, మురళీ మనోహర్, ఎంబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.ఆశయ్య, రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.