'అనుమతుల్లేని ఇంటర్ విద్యాసంస్థలపై చర్యలు' | actions of wఉthout permit inter colleges | Sakshi
Sakshi News home page

'అనుమతుల్లేని ఇంటర్ విద్యాసంస్థలపై చర్యలు'

Aug 4 2015 3:25 PM | Updated on Sep 3 2017 6:46 AM

హైదరాబాద్ నగరంలోని ఇంటర్ విద్యా సంస్థల్లో ఒక కళాశాలకు అనుమతి తీసుకొని మూడు, నాలుగు కళాశాలలు నడుపుతున్నారని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి సంఘం అధ్యక్షుడు కొండా సాయికిరణ్ గౌడ్ ఆరోపించారు.

హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలోని ఇంటర్ విద్యా సంస్థల్లో ఒక కళాశాలకు అనుమతి తీసుకొని మూడు, నాలుగు కళాశాలలు నడుపుతున్నారని వైఎస్సార్సీపీ నగర విద్యార్థి సంఘం అధ్యక్షుడు కొండా సాయికిరణ్ గౌడ్ ఆరోపించారు.  మంగళవారం ఆయన బంజాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ.. 'కళాశాలల్లో సరైన వసతులు కరువయ్యాయి. దీంతో విద్యార్థులు సతమతమౌతున్నారు. తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలి' అని మంత్రిని కోరారు. అనుమతులు లేకుండా కొనసాగుతున్న కళాశాలల జాబితా తమకు అందజేస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement