ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంతో పాటు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంతో పాటు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన బ్రాండెక్స్ కంపెనీ కార్మికులను వేధిస్తోందని మండిపడ్డారు.
బ్రాండెక్స్ కార్మికుల వేతనాలు పెంచేలా జీవోను సవరిస్తామన్న హామీని మంత్రి అచ్చెన్నాయుడు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రాండెక్స్ అరాచకాలపై కమిటీ వేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.