ఏసీబీ వలలో టాక్స్ ఇన్‌స్పెక్టర్ | ACB caught tax inspector | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో టాక్స్ ఇన్‌స్పెక్టర్

Jun 29 2016 4:32 PM | Updated on Sep 4 2018 5:21 PM

లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీఅబిడ్స్ ఏరియా9ఏ టాక్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

 లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీఅబిడ్స్ ఏరియా9ఏ టాక్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ముషీరాబాద్ బోల క్‌పూర్‌కు చెందిన మక్బూల్‌పాషా అనే వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇంటికి సంబంధించి మ్యుటేషన్ చేయించుకోవడానికి రవీందర్ రూ.4 వేలు లంచం అడగడంతో మక్బూల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రవీందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement