breaking news
raveendar
-
ఏసీబీ వలలో టాక్స్ ఇన్స్పెక్టర్
లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీఅబిడ్స్ ఏరియా9ఏ టాక్స్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ముషీరాబాద్ బోల క్పూర్కు చెందిన మక్బూల్‌పాషా అనే వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇంటికి సంబంధించి మ్యుటేషన్ చేయించుకోవడానికి రవీందర్ రూ.4 వేలు లంచం అడగడంతో మక్బూల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రవీందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వేలో సమ్మె సైరన్
కార్మికుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు జులై 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సమ్మె నోటీసును సికింద్రాబాద్ రైల్ నిలయంలోని దక్షిణ మధ్యరైల్వే జీఎం రవీందర్‌కు కార్మిక నేతలు గురువారం సమ్మె నోటీసును అందజేశారు. రైల్వే కార్మిక సంఘం నేత రాఘవయ్య నేతృత్వంలో సికింద్రాబాద్ నుంచి భారీ ర్యాలీతో వచ్చి సమ్మె నోటీసు అందజేశారు. కొత్త పెన్షన్ విధానం, బిబేక్ దెబ్రయ్ కమిటీ రద్దుతోపాటు, ఖాళీ ఉద్యోగా లభర్తీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మెనోటీసు ఇచ్చిన రాఘవయ్య తెలిపారు. జులై 11లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
హయత్‌నగర్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో బ్రిల్లియంట్ కాలేజీ ఆర్చ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ముందు వెళ్తోన్న గుర్తుతెలియని వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడి నల్గొండ జిల్లా చిట్యాల మండలం సుంకన్పల్లి గ్రామానికి చెందిన రవీందర్(25) అనే డ్రైవర్ మృతిచెందాడు. నిమ్మకాయల లోడుతో చిట్యాల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుని దారుణ హత్య
ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామ శివారులో సోమవారం దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన రవీందర్ (30)ను ముగ్గురు దుండగులు హతమార్చారు. అనంతరం బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. రవీందర్ తమ్ముడు తమకు రూ.5లక్షలు ఇచ్చి హత్య చేయించాడని వారు పోలీసుల ఎదుట వాగ్మూలం ఇచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రవీందర్ తమ్ముడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. రవీందర్ హత్యకు గల కారణలు తెలియరాలేదు. -
‘మీసేవ’లో వ్యవసాయం
సాక్షి, నిజామాబాద్: వ్యవసాయ సేవలను ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా రైతులకు అందించేందుకు ఆ శాఖ సన్నద్ధమవుతోంది. యాం త్రీకరణ వంటి పథకాలతో పాటు విత్తనాలు, ఎరువుల పంపిణీని కూడా మీసేవ కేంద్రాల ద్వారానే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వివిధ సర్టిఫికెట్లను ఈ కేంద్రాల ద్వారా జారీ చే స్తున్నారు. తాజాగా వ్యవసాయశాఖ సేవలను కూడా ఈ కేంద్రాల పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ రబీ సీజను ముగిసేలోపు సేవలను రైతన్నలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. పెలైట్ ప్రాజెక్టు కింద డిచ్పల్లి వ్యవసాయ డివిజన్‌ను ఎంపిక చేశారు. డివిజన్ పరిధిలోని జక్రాన్‌పల్లి, ధర్పల్లి, డిచ్పల్లి మండలాల్లో ముందుగా ప్రాజెక్టును అమ లు చేస్తారు. సాంకేతిక పరమైన, మరేవైనా లోటుపాట్లు తలెత్తితే వాటిని సరిచేసి జిల్లా అం తటా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇం దులో భాగంగా డిచ్పల్లి ఏడీఏ రవీందర్‌తో పా టు, నలుగురు వ్యవసాయాధికారులకు శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన శిక్షణ తరగతులకు కూడా వీరు హాజరయ్యారు. ముందుగా మూడు రకాల సేవలు మీసేవా కేంద్రాల ద్వారా ముందుగా మూడు రకాల వ్యవసాయ సేవలను అందిస్తారు. సబ్సి డీ విత్తనాల పంపిణీ, పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ పథకం దరఖాస్తులను మీసేవా ద్వారా స్వీకరించి, వాటి ద్వారానే లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ చేస్తారు. రైతులు నేరుగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. వ్యవసాయాధికారు లు నిర్ణీత సమయంలో ఈ సేవలను రైతులకు అందించాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్టు జిల్లా అంతటా అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలైతే రైతన్నల ఇక్కట్లు చాలామట్టుకు తగ్గుతాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నా రు. ఈనెలాఖరు వరకు ప్రాజెక్టు రైతులకు అం దుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ నర్సింహ ‘సాక్షి’తో పేర్కొన్నారు. రైతుల కష్టాలకు ఇక చెక్... సబ్సిడీ విత్తనాల కోసం రైతులు ఇకపై వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. రద్దీ ఎక్కువైనే బారులు తీరాల్సిన పనిలేదు. యాంత్రీకరణ పథకం కింద సబ్సిడీపై యంత్రాలను పొందాలనుకునే అన్నదాతలు ఆయా మండలాల ఏఓ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. బ్యాంకు రుణాలు పొందని రైతులు మీసేవా కేంద్రాల ద్వారానే తమ పంటలకు బీమా చేయించుకునే సదుపాయం కల్పిస్తారు. మొత్తం మీద వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యక్షంగా సంబంధం లేకుండానే పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా పారదర్శకత పెరగడమే కాకుండా, అవినీతి అక్రమాలకు చాలామట్టుకు చెక్‌పడుతుందని భావిస్తున్నారు.